ఆటోనగర్‌ నిర్మాతతొ చైతు

 

తడాఖ సినిమాతో మంచి ఫాంలోకి వచ్చిన నాగాచైతన్య ప్రస్థుతం అక్కినేని ఫ్యామిలీ చేస్తున్న మల్టీ స్టారర్‌ మూవీ మనం సినిమాలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాతో తప్ప ఇంతవరకు సోలో హీరోగా ఒక్క సినిమా కూడా స్టార్ట్‌ చేయలేదు చైతు. అయితే ఇప్పుడు ఓ రిస్కీ  ప్రాజెక్ట్‌కు రెడీ అవుతున్నాడట ఈ యంగ్ హీరో.

ఢమరుకం, అటోనగర్‌ సూర్య సినిమాల రిలీజ్‌ విషయంలో చాలా డిలే చేసిన వెంకట్‌ నిర్మాతగా మరో సినిమా ఓకే చేశాడని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. ఢమరుకం సినిమాను ఆలస్యంగా రిలీజ్‌ చేయడంతో పాటు అటోనగర్‌ సూర్యను ఇంతవరకు రిలీజ్‌ చేయని అదే నిర్మాతతో చైతు మరో సినిమా ఎలా ఓకె చేశాడాని ఆశ్చర్యపోతున్నారు.

యువత, సోలో లాంటి కూల్‌ హిట్స్‌ అందించిన పరుశురాం డైరెక్షన్‌లో నాగచైతన్య శూన్యం అనే సినిమాలో నటించనున్నాడట. అయితే ఈసినిమాను ఆర్‌ ఆర్‌ మూవీమూకర్స్‌ బ్యానర్‌పై కాకుండా కేవలం వెంకట్‌ మాత్రమే సొంతంగా నిర్మించనున్నడాట. ఏది ఏమైనా వరుసగా అక్కినేని ఫ్యామిలీకి రెండు షాక్‌లు ఇచ్చిన నిర్మాతతో చైతు మరో సినిమా ఒప్పుకోవటం పెద్ద సాహసమే.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu