బాలయ్యతో ఆదిత్య 999
posted on Sep 14, 2013 8:53PM

బాలకృష్ణ హీరోగా సింగీతం శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఆదిత్యా 369 సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పట్లో ఎవరూ ఊమించని విధంగా హాలీవుఢ్ స్థాయిలో టైమిషన్ కాన్సెప్ట్ తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్ సాదించిన సినిమా ఆదిత్య 369. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వల్ తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడట చిత్రయూనిట్.
అయితే ఈసినిమాకు ఇప్పుడడు సీక్వల్ రెడీ చేస్తున్నారు దర్శకుడు సింగీతం శ్రీనివాస్. ఇప్పటి జనరేషన్కు తగ్గటుగా అన్ని రకాల కమర్షియల్ హంగులతో పాటు తన మార్క్ ఉండేలా సినిమా స్క్రీప్ట్ రెడీచేస్తున్నారు సింగీతం. ప్రస్థుతం వెల్‌కం ఒబామా సినిమా కంప్లీట్ చేసిన సింగీతం వచ్చే ఏడాది ఆదిత్య 369కు సీక్వల్‌ను సెట్స్ మీదకు తీసుకురాన్నారు.
ఆదిత్య 369లో హీరోగా నటించిన బాలకృష్ణ ఈ సినిమాలో కూడా హీరోగా నటించనున్నారు. అంతేకాదు ఈ సినిమాకు ఆదిత్య 999 అనే టైటిల్‌ను కూడా కన్ఫార్మ్ చేశారట. అయితే ప్రస్థుతం కమర్షియల్ మాయలో పడిన సినీవర్గాలు సినిమాలను మానవీయ విలువలకు దూరంగా తెరకెక్కిస్తున్నారన్న సింగితం తన సినిమాల్లో మాత్రం ప్రేమానురాగాలతో పాటు మానవీయ విలువలకు కూడా పెద్ద పీట వేస్తానని చెప్పారు.