ఫ్లాపుల్లోనూ అదే బలుపు

 

        చాలా రోజులుగా ఒక్క హిట్‌ లేని ఓ స్టార్‌ హీరో ఈ మద్యే సక్సెస్‌ కొట్టాడు.. లేక లేక వచ్చిన హిట్టే అయినా ఆ హీరో గారు మాత్రం అదంతా తన సక్సెసే అని తెగ పొంగిపోతున్నాడట.. అంతేకాదు తన రెమ్యునరేషన్‌  కూడా ఒక్కసారిగా పెంచేశాడట..

        టాలీవుడ్‌లో గాడ్‌ ఫాదర్‌ లేకుండా ఇండస్ట్రీలోకి రావడం సక్సెస్‌ అవ్వడం కుదరదు అనుకుంటున్న టైంలో.. ఎలాంటి ఫిల్మ్‌ బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా కేవలం తన స్టామినాతోనే హీరోగా ఎదిగిన నటుడు మాస్‌ మహారాజ్‌ రవితేజ.

        నెగెటివ్‌, క్యారెక్టర్‌ రోల్స్‌ నుంచి హీరోగా మారిన రవితేజ తరువాత స్టార్‌ హీరోగా మారాక కూడా వరస సినిమాలతో సత్తా చాటాడు.అ యితే గత కొంత కాలంగా ఈ హీరోగారికి టైం ఏం అంత బాగున్నట్టుగా లేదు. చేసిన ప్రతి సినిఆమ బకెట్‌ తన్నేయటంతో ఫ్లాఫ్ హీరోగా ముద్ర వేయించుకున్నాడు రవితేజ.

        వరుస ఫ్లాప్స్‌తో సతమతమవుతున్న రవితేజ తరువాత ఎన్ని ప్రయోగాలు చేసినా సక్సెస్‌ మాత్రం సాదించలేకపోయాడు. అయితే చివరకు బలుపు రూపంలో మళ్లీ సక్సెస్‌ ట్రాక్‌లోకి వచ్చాడు రవితేజ.

        అయితే ఈ సక్సెస్‌తో రవితేజ రేంజ్‌ బాగా పెరిగిపోయిందన్న టాక్‌ వినిపిస్తుంది. చాలా రోజుల తరువాత వచ్చిన ఒక్క హిట్‌ తోనే రెమ్యునరేషన్‌ను భారీగా పెంచేశాడు రవితేజ

 

        అసలు ప్లాపుల్లో ఉన్న హీరో దానికి తోడు భారీ రెమ్యునరేషన్‌ దీంతో ఇప్పుడు రవితేజతో సినిమా చేయడానికి ఏ నిర్మాత ముందుకు రావడం లేదట. కాని రవితేజ మాత్రం రెమ్యునరేషన్‌ విషయంలో చాలా స్ట్రీక్ట్‌గా ఉంటున్నాడని టాక్‌.

        దీంతో బలుపు రిలీజ్‌ అయి ఇన్ని రోజులు అవుతున్న రవితేజ ఇంతవరకు ఏ సినిమా కమిట్‌ అవ్వలేదు మరి ఇప్పుడైన తన రూట్‌ మార్చుకుంటాడో లేదో చూడాలి

Online Jyotish
Tone Academy
KidsOne Telugu