తండ్రి లైంగిక కోరిక తీర్చాలన్నాడు: నటి శిరీష
posted on Aug 20, 2013 12:19PM

హీరోయిన్ సాయి శిరీష వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. గత కొన్ని రోజులుగా కనిపించకుండా పోయిన నటి సాయి శిరీష సోమవారం టీవి ఛానెల్ లో ప్రత్యక్షమయ్యింది. లైంగిక కోరిక తీర్చాలని తన సవతి తండ్రి వేదిస్తున్నాడని, అందుకే తాను ఇంటి నుంచి పారిపోయానని హీరోయిన్ శిరీష ఆరోపించింది.
తన తల్లి..సవతి తండ్రి పై ఆధారపడి బతుకుతోందని, అందువల్లే తాను పోలీసులకు ఫిర్యాదు చేయలేకపోయానని తన బాధను బయటపెట్టింది. తన తల్లి ఇంట్లో లేని సమయాలు చూసి తన లైంగిక కోరిక తీర్చాలని సవతి తండ్రి ఒత్తిడి పెడుతూ వచ్చాడని..లేకుంటే తీవ్ర పరిణామాలు౦టాయని హెచ్చరించడని చెప్పింది.
''లవ్ ఎటాక్'' సినిమాలో నటిస్తున్న సాయి శిరీష గత కొన్ని రోజుల నుండి కనిపించటంలేదని పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆమె ఎక్కడుందన్న విషయం పోలీసులకు తెలియడం లేదు. టీవికిచ్చిన ఇంటర్వ్యూ ద్వారా ఆమె ఎక్కడ ఉందనే విషయాన్ని తెలుసుకుంటామని పోలీసులు తెలిపారు.