తమిళ మార్కెట్ మీద కన్నేసిన భాయ్

 

          ఇన్నాళ్లు పరభాష సినిమాల దాడితో తెలుగు సినిమా కుదేలవుతుందని బాధ పడిన మన తెలుగు హీరోలు, వాటిని ఆపలేకసపోవడంతో వీళ్లు కూడా ఇతర భాషల మీద కాన్సన్‌ ట్రేట్‌ చేస్తున్నారు. ఇప్పటికే కొంత మంది యంగ్‌ హీరోస్‌ ఈ లిస్ట్‌లో ముందు ఉండగా ఇప్పుడు ఓ సీనియర్‌ స్టార్‌ హీరో కూడా ఈ లిస్ట్‌లో చేరబోతున్నాడు.

        వయసుతో సంభందం లేకుండా ఇప్పటికీ టాలీవుడ్‌ మన్మధుడిగా మంచి ఫామ్‌లో ఉన్న హీరో నాగార్జున. తన జనరేషన్‌ హీరోలందూ అడపదడపా సినిమాలు చేస్తూయ స్పీడు తగ్గించినా… నాగ్‌ మాత్రం ఇంకా ఫుల్‌ ఫామ్‌లో సినిమాలు చేస్తున్నాడు.

        అయితే హీరోగా టాలీవుడ్‌లో మంచి మార్కెట్‌ ఉన్ననాగ్‌ యంగ్‌ హీరోలకు మాత్రం టఫ్‌ కాంఫిటీషన్‌ ఇవ్వలేకపోతున్నాడు. దానికి కారణం సరైన మార్కెట్‌ లేకపోవటమే. అందుకే ఇప్పుడు నాగార్జున పరభాషా మార్కెట్ల మీద కాన్సన్‌ట్రేట్‌ చేస్తున్నాడు.

        ఇప్పటికే అల్లు అర్జున్‌ రామ్‌చరన్‌లాంటి స్టార్లకు ఇతర భాషల్లో మంచి మార్కెట్‌ ఉంది. ముఖ్యంగా బన్నీ అయితే మళయాలంలో టాప్‌ స్టార్‌గా వెలుగొందుతున్నాడు. ఇక రామ్‌చరణ్‌ సౌత్‌తో పాటు నార్త్‌లో కూడా పట్టుకోసం తెగ కష్టపడిపోతున్నాడు.

        దీంతో ఇక రేస్‌లో నిలబడాలంటే నాగ్‌కు కూడా అదర్‌ లాంగ్వేజస్‌ గురించి ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే తన లేటెస్ట్‌ మూవీ భాయ్‌ని తెలుగుతో పాటు తమిళ్‌లో కూడా ఒకేసారి రిలీజ్‌ చేయాలనుకుంటున్నాడట నాగ్‌..

        మరి ఈ ప్రయోగంతో నాగ్‌ కుర్రహీరోలకు కూడా సవాళ్ల విసురుతాడేమో చూడాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu