బజారు మనిషిలా మాట్లాడితే ఊరుకోం.. రావెల

ఆంధ్రప్రదేశ్ మంత్రి రావెల కిషోర్ బాబు తెలంగాణ సీఎం కేసీఆర్ పై దుమ్మెత్తి పోశారు. రేవంత్ రెడ్డి కేసులో చంద్రబాబును ఎలాగైనా ఇరికించాలని కేసీఆర్ చూస్తున్నాడని, కానీ అది ఎప్పటికీ జరగదని హెచ్చరించారు. కేసీఆర్ ఆచితూచి మాట్లాడాలని బజారు మనిషిలా మాట్లాడితే ఊరుకునేది లేదని మండిపడ్డారు. టేపుల వ్యవహారంలో చంద్రబాబును ఇరికించాలని చూసిన కేసీఆర్ కు తగిన గుణపాఠం చెబుతామని, తాను చేసిన పని ఇప్పుడు తనకే ఉరితాడుగా మారబోతుందని అన్నారు. ఇప్పటికైనా తన వైఖరి మార్చుకుంటే మంచిది లేకపోతే కోర్టుకు వెళ్లాల్సివస్తుందని హెచ్చరించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu