నరేంద్ర మోడీ మూర్ఖపు ప్రధాని.. కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

 

ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ నాయకుడు రషీద్ అల్వీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మోడీ ప్రధానిగా బాద్యతలు చేపట్టి రెండెళ్లు పూర్తవుతున్న సందర్భంగా చర్చా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మోడీపై విమర్శనాస్త్రాలు సంధించారు. రెండేళ్ల పాలనలో అత్యంత మూర్ఖ ప్రధానిగా మోడీ నిలిచారనీ, ఆయనపై ఏ చర్య తీసుకోవాలో చెప్పమని స్మృతి ఇరానీని ఉద్దేశించి రషీద్ అల్వీ అన్నారు. ఈ కార్యక్రమంలో స్మృతి ఇరానీ కూడా పాల్గొన్నారు. దీనిపై ఆమె స్పందిస్తూ కాంగ్రెస్ లో మోడీపై విమర్శలు చేసేవాళ్లు చాలా మందే ఉన్నారు.. అయితే ఈరోజు హద్దులు దాటారు.. మోడీ ఒక దేశానికి ప్రధాని అన్న విషయం కూడా మరిచిపోయి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

మరోవైపు రషీద్ అల్వీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మోడీ పై చేసిన వ్యాఖ్యలకు రషీద్ అల్వీ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తోంది. రషీద్ అల్వీ తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ‘షేమ్ షేమ్ కాంగ్రెస్’ అంటూ నినాదాలు చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu