ఏపీ కరువుపై మోడీతో చర్చించా.. ఆయన హ్యాపీగా ఫీలయ్యారు..
posted on May 17, 2016 5:57PM
.jpg)
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఏపీ కరువుపై ప్రధానితో చర్చించా అని తెలిపారు. కరువు పరిష్కారానికి మోడీతో చర్చ ఉపయోగపడుతోందని వ్యాఖ్యానించారు. గత పదేళల్లో భారత్ లో సంభవించిన తుపానులన్నింట్లో హుదూద్ పెద్దదని మోదీ చెప్పారని.. అంత పెద్ద ఉత్పాతం నుంచి కోలుకున్న ఏపీ, కరవును సమర్ధవంతంగా ఎదుర్కొంటుందని ఆయన చెప్పారని అన్నారు. ఇంకా పలు విషయాలు ఆయనకు వివరించామని.. గత పదేళ్లు తుఫానులు వచ్చాయి.. రెండేళ్ల నుండి కరువు వచ్చింది.. రాష్ట్రంలో రూ. 737 ఇన్ పుట్ సబ్సిడీ ఇస్తున్నాం.. 18 వేల మెట్రిక్ టన్నుల గడ్డి ఇస్తున్నాం.. 973 గ్రామాలకు తాగునీటి సరఫరా అందిస్తున్నాం.. రెండువేల కోట్లతో కరువును ఎదుర్కొంటున్నాం.. నదుల అనుసంధానం జరగాలి.. ఉన్న నీళ్లను సమర్ధవంతంగా ఉపయోగించుకోవాలి.. పంటలకు మైక్రో ఇరిగేషన్ శ్రీరామ రక్షగా ఉంటుంది.. కొత్తగా రెయిన్ గన్ పద్దతిని తీసుకొస్తున్నాం.. ప్రతి ఇంటికీ మంచినీరు ఇవ్వాలని ఆలోచిస్తున్నామని మోడీకి తెలిపాని చెప్పారు. మేం చెప్పిన వివరాలపై ప్రధాని హ్యాపీగా ఫీలయ్యారని తెలిపారు.