బస్సులో అత్యాచారయత్నం, హత్య
posted on Apr 30, 2015 7:49PM

పంజాబ్‌లోని మొగా పట్టణంలో కదులుతున్న బస్సులో ప్రయాణిస్తున్న 14 ఏళ్ళ బాలికను కొంతమంది దుండగులు వేధించి అత్యాచారం జరపడానికి ప్రయత్నించారు. ఆ బాలిక ప్రతిఘటించడంతో ఆమెను బస్సు నుంచి కిందకి తోసేసి చంపేశారు. తన తల్లి, తమ్ముడితో కలసి ఆ బాలిక బస్సులో ప్రయాణిస్తుండగా ఈ దారుణం జరిగింది. అత్యాచారం జరిగిన సమయంలో బస్సులో డ్రైవర్, కండక్టర్ కూడా వున్నారు. బాలికను దుండగులు వేధిస్తూ అత్యాచారానికి ప్రయత్నిస్తూ వుండగా ఆమె తల్లి వాళ్ళను నిలువరించాలని ప్రయత్నించింది. బస్సును ఆపాలని కోరినా డ్రైవర్ ఆపలేదు. చివరికి ఆ దుండగులు ఆ బాలికను, ఆమె తల్లి, తమ్ముడిని బస్సులోనుంచి కిందకి తోసేయడంతో ఆ బాలిక మరణించింది. తల్లి, తమ్ముడు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. ఈ ఘోరం జరిగిన బస్సు ఆర్బిట్ అనే కంపెనీకి చెందింది. ఈ బస్సులో పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్‌కి చెందినది. దాంతో ఈ ఘటన రాజకీయ రంగు పులుముకుంది. ప్రకాష్ సింగ్ బాదల్ ఈ ఘటన పట్ల తన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ బస్సు తమకు చెందినదే అని, ఈ ఘటనకు కారణమైన వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.