ఫామ్ హౌస్‌లో లిక్కర్, డ్రగ్స్ పార్టీ... 51 మంది అరెస్ట్
posted on Aug 15, 2025 1:56PM

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ఫామ్ హౌస్‌లో గుట్టుచప్పుడు కాకుండా లిక్కర్, డ్రగ్స్ పార్టీ జరుగుతుండగా పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. వివరాల్లోకి వెళితే.. బాకారం గ్రామ పరిధిలోని SKM ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్, లిక్కర్ పార్టీ జరుగుతోందని ఎక్సైజ్ పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో వారు నార్కోటిక్ బ్యూరో అధికారులతో కలిసి హుటాహుటిన ఫామ్‌హౌస్‌పై దాడి చేశారు. ఈ మేరకు పార్టీలో పాల్గొన్న మొత్తం 51 మంది ఆఫ్రికన్లను అదపులోకి తీసుకున్నారు. అయితే, అందరికీ డగ్స్ పరీక్షలు నిర్వహించగా.. అందులో ముగ్గురికి పాజిటివ్ వచ్చింది.
అనంతరం స్పాట్‌కు ఇమ్మిగ్రేషన్ అధికారులు కూడా చేరుకుని వారి వీసాలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై డీసీపీ శ్రీనివాస్ మాట్లాడుతు మొత్తం 51 మందిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. వీరిలో 14 మంది పురుషులు, 37 మంది మహిళలు ఉన్నారని పేర్కొన్నారు.అందరూ ఆఫ్రికన్ కంట్రీస్ కి చెందిన వాళ్లే..65 బీర్లు, 20 లీటర్ల మద్యాన్ని సీజ్ చేశామని తెలిపారు.వీరి వీసా స్టేటస్ గురించి ఇమ్మిగ్రేషన్ అధికారుల నుంచి వివరాలు తెలుసుకుంటున్నామన్నారు.ఇమ్మిగ్రేషన్ అధికారులు తనిఖీలు పూర్తైన తరువాత డ్రగ్స్ టెస్టులు నిర్వహిస్తామని డీసీపీ తెలిపారు.ఫామ్ హౌస్ యజమానిపై కేసు నమోదు చేస్తామని డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు