ఓడితేనే ఓటు చోరీనా...గెలిస్తే ఉండదా? : పవన్
posted on Aug 15, 2025 1:27PM
.webp)
ఏపీలో అభివృద్ధి, సంక్షేమం సమనంగా ముందుకు సాగుతున్నాయని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ అన్నారు. సూపర్ సిక్స్పథకాలను అమలు చేస్తూ మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని పవన్ తెలిపారు. కాకినాడ పరేడ్ గ్రౌండ్ లో 79 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం డిప్యూటీ సీఎం పవన్ మాట్లాడుతు ఆంధ్ర ప్రదేశ్‌లో ఓట్ చోరీ జరిగిందంటూ వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. జాతీయ స్థాయిలో, రాష్ట్రస్థాయిలో కొందరు నాయకులు ఓడితే ఓట్ చోరీ అంటున్నారు. వాళ్లు గెలిచినప్పుడు ఇవన్నీ కనిపించవా అని డిప్యూటీ సీఎం ప్రశ్నించారు.
2019లో వైసీపీ విజయం సాధించినప్పుడు మేం ఎక్కడా ఆ మాట అనలేదు ప్రజలు తీర్పును గౌరవించామన్నారు. 2024లో 164 అసెంబ్లీ సీట్లు మేం గెలిస్తే ఇది ఈవీఎంల మిషన్లలో తప్పు అన్నాట్లు మాట్లాడారు. ఇదేం న్యాయం అని పవన్ విమర్శించారు.రాష్ట్రంలో తల్లికి వందనం పథకం ద్వారా ఈ ఏడాది 67.27 లక్షల మాతృమూర్తులకు 8,745 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశాం. దీపం2 పథకం కింద ఇప్పటికీ 2 విడతలుగా కోటి ఉచిత గ్యాస్ సిలిండర్లు, 5 ఏళ్ళలో ఏడాదికి 3 సిలిండర్ల చొప్పున 13,423 కోట్లు ఖర్చు చేయబోతున్నాం. ఈ రోజు నుండి స్త్రీ శక్తి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయా ణం ప్రారంభిస్తున్నాం అన్నారు.