రామోజీ ఓం సిటీ కోసం 505 ఎకరాల భూమి మంజూరు?

 

తెరాస అధికారంలోకి రాక మునుపు రామోజీ ఫిలిం సిటీని లక్ష నాగళ్లను పెట్టి దున్నించి చదును చేసేస్తానని తెరాస అధినేత కేసీఆర్ అనేవారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఆయనే స్వయంగా రామోజీ ఫిలిం సిటీకి వెళ్లి ఆ సంస్థ చైర్మన్ రామోజీరావుని కలిసి వచ్చేరు. అంతే కాదు ఆయన కట్టబోయే ఆధ్యాత్మిక నగరం ‘ఓం సిటీ’కి సుమారు 505 ఎకరాల భూమిని ఇవ్వబోతున్నాట్లు తాజా సమాచారం. ఆయన ఓం సిటీ నిర్మించేందుకు 2,000 ఎకరాల భూమి కావాలని కోరుతూ గత ఏడాది ఏప్రిల్ నెలలో తెలంగాణా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకొన్నారు. ఆ తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ తనని కలవడానికి వచ్చినప్పుడు, ఓం సిటీ చిత్రాలను చూపించినపుడు కేసీఆర్ అందుకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారని వార్తలు వచ్చేయి. కానీ అంత భూమి ఒకేచోట లభించకపోవడంతో ముందుగా హయత్ నగర్ మండలంలోని కోహెడ, అబ్దుల్లాపూర్ గ్రామాలలో సుమారు 505 ఎకరాల భూమిని అప్పగించడానికి అధికారులు అని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

 

సుమారు రూ.3, 000 కోట్ల వ్యయంతో దేశంలో ఉన్న అన్ని ప్రధాన పుణ్యక్షేత్రాల నమూనాలను నిర్మించడానికి రామోజీరావు ప్రణాళికలు సిద్దం చేసుకొన్నారు. అందులో కూడా సినిమా స్టూడియోలు, థియేటర్లు, అతిధుల కోసం హోటళ్ళు, సుందరమయిన పార్కులు వగైరాలన్నీ నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితమే రామోజీ రావు డిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడిని కలిసి తను చెప్పట్టబోయే ఆ ప్రాజెక్టు గురించి కలిసి వివరించేరు. నరేంద్ర మోడీ కూడా ఆయన ఆలోచనను అభినందించేరు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu