కేంద్రం నామినేట్ చేసిన రాజ్యసభ సభ్యులు వీరే..!
posted on Apr 23, 2016 11:06AM

రాజ్యసభలో మొత్తం 12 నామినేటెడ్ సభ్యులకుగాను ఏడు స్థానాలు ఖాళీగా ఉన్న సంగతి తెలసిందే. దీనికి గాను కేంద్ర ప్రభుత్వం ఆరుగురి పేర్లను నామినేట్ చేసింది. కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసిన పేర్లు భాజపా నేతలు సుబ్రమణ్య స్వామి, నవజోత్‌సింగ్ సిద్ధూలతో పాటు ప్రముఖ మహిళా బాక్సర్ మేరీకోం, నరేంద్ర జాదవ్ (ఆర్థికవేత్త), సురేశ్ గోపి (మలయాళ నటుడు), స్వపన్ దాస్‌గుప్తా (పాత్రికేయుడు). అయితే ఆరుగురు పేర్లు ఖరారు కాగా మరో స్థానం ఖాళీగా ఉంది. ఈ స్థానానికి ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్, పాత్రికేయుడు రజత్‌శర్మల పేర్లు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాజ్యసభ నామినేటెడ్ సభ్యులుగా ప్రభుత్వం సిఫార్సు చేసిన ఆరుగురి పేర్లను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం ఆమోదించినట్లు హోంశాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. అయితే, దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.