శక్తిమాన్ మృతికి నాకు సంబంధం లేదు.. నా కాళ్లు నరుక్కుంటా.. గణేష్ జోషి
posted on Apr 23, 2016 10:46AM

ఉత్తరాఖండ్లో భద్రతా దళానికి చెందిన శక్తిమాన్ అనే గుర్రం మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై అందరూ బీజేపీ ఎమ్మెల్యే గణేష్ జోషిపై మండిపడుతున్నారు. అంతేకాదు శక్తిమాన్ మృతికి కారణమైన ఎమ్మెల్యేను అరెస్ట్ చేయాలని.. జంతు హక్కుల కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. కేంద్రమంత్రి మేనకా గాంధీ కూడా సదరు ఎమ్మెల్యేను అరెస్ట్ చేయాలని అంటున్నారు. మరోవైపు గణేష్ జోషి మాత్రం శక్తిమాన్ మృతికి తనకు ఎలాంటి సంబంధం లేదని, ఇన్ఫెక్షన్ సోకడంతో గుర్రం మృతి చెందిందని అంటున్నారు. శక్తిమాన్ మృతికి తానే కారణమని నిరూపిస్తే తన కాళ్ళను తానే నరుక్కుంటానని సవాల్ కూడా చేస్తున్నారు.
కాగా.. మార్చి 14న జరిగిన ఆందోళనలో బీజేపీ ఎమ్మెల్యే గణేష్ జోషి ఓ కర్రతో శక్తిమాన్ కాళ్ళపై కొడుతున్నట్లు మీడియాలో ప్రసారమైన సంగతి తెలిసిందే. జోషి కొట్టడం వల్ల గుర్రం కాలికి గాయమై.. కాలును తొలగించారు. అనంతరం అమెరికా నుండి తెప్పించిన కృత్రిమ కాలును అమర్చారు. అయితే చిన్న చిన్నగా కోలుకుంటుదనుకుంటుండగానే మృతి చెందింది.