రాజ్యసభలో గందరగోళం..వాయిదా

 

 

 

పార్లమెంట్ ఉభయ సభల సమావేశాలు ఈరోజు ఉదయం ప్రారంభమయ్యాయి. రాజ్యసభ ప్రారంభమైన వెంటనే మధ్యాహ్నం 12గంటలకు వాయిదా పడింది. సభ ప్రారంభమైన వెంటనే యధావిధిగా సీమాంధ్ర ఎంపీలు వెల్ లోకి వచ్చి సమైక్య నినాదాలు చేస్తూ...సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ నిరసన వ్యక్తం చేయడంతో సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. సభ సజావుగా జరగడానికి ఎంపీలు సహరించాలని స్పీకర్ విజ్ఞప్తి చేసిన సీమాంధ్ర వెనక్కి తగ్గపోవడంతో సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈరోజు మధ్యాహ్నం తెలంగాణ బిల్లుపై సభలో చర్చ జరిగే అవకాశం వుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu