రాజలింగం హత్య సిఐడికి అప్పగించాలి: భార్య సరళ
posted on Mar 1, 2025 10:26AM
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణ హత్యకు గురైన సామాజికవేత్త రాజలింగ మూర్తి హత్య తెలంగాణలో సంచలనమైంది. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపిస్తూ గత కొంత కాలంగా రాజలింగ మూర్తి పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. కేసు విచారణకు వచ్చే ఒక రోజు ముందే రాజలింగ మూర్తి హత్యకు గురికావడం రాజకీయంగా హీటెక్కించింది. బిఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య మాటలయుద్దం కొనసాగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ గానే రియాక్ట్ అవుతున్నారు. రాజలింగ మూర్తి భార్య సరళ బిఆర్ఎస్ నేతలపై ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా తన భర్త హత్య కేసును సిబిసిఐడిచేత విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. తన ఫ్యామిలీకి బిఆర్ఎస్ నాయకులతో ప్రాణహాని పొంచి ఉందని రాజలింగమూర్తి భార్య సరళ ఆరోపించారు. తన భర్త హత్య జరిగినప్పటి నుంచీ తాము భయంతో బిక్కుబిక్కు మంటూ బతుకుతున్నామని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.