శివసేనలోకి రాజా సింగ్?
posted on Dec 4, 2015 7:46AM
.jpg)
హైదరాబాద్ లోని బీజేపీ ఘోషా మహల్ ఎమ్మెల్యే టి. రాజా సింగ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పై తిరుగుబాటు చేయడం, పార్టీకి నష్టం కలిగించే విధంగా మాట్లాడటం కారణంగా అతనిని పార్టీలో నుండి తొలగించాలని బీజేపీ భావిస్తోంది. అతను కూడా పార్టీని వీడే ఆలోచనతో ఉన్నారు.
ఆయన మొదట తెరాసలో చేరుదామని భావించినప్పటికీ, శివసేన పార్టీ నుండి మంచి ఆఫర్ రావడంతో ఆయన తెరాసలో చేరే ఆలోచనను విరమించుకొన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో శివసేన పార్టీ చాలా కాలంగా ఉన్నపటికీ, దానికి బలమయిన నాయకులు, కార్యకర్తలు లేకపోవడంతో అది తన ఉనికిని చాటుకోలేకపోతోంది. కనుక రాజా సింగ్ ను పార్టీలోకి ఆహ్వానించి అతనికి అధ్యక్ష భాద్యతలు అప్పగించాలనిశివసేన పార్టీ భావిస్తున్నట్లు తాజా సమాచారం. అందుకు రాజా సింగ్ కూడా సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది. బహుశః నేడో రేపో అతను ఒక నిర్ణయం తీసుకోవచ్చును. కానీ అతను బీజేపీని విడిచి దానికి మిత్రపక్షమయిన శివసేనలోకి వెళ్ళినట్లయితే, అతని వలన తెలంగాణా బీజేపీ నేతలకి ఏదో ఒకవిధమయిన తలనొప్పులు తప్పకపోవచ్చును.