కేసిరెడ్డి పీఏకి బెయిలొచ్చింది కానీ.. పాపం!

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడు రాజ్ కేసిరెడ్డి దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ ను ఏసీబీ కోర్టు గురువారం (ఆగస్టు 28) కొట్టివేసింది. ఈ కేసులో రాజ్ కేసిరెడ్డి ఏ1 అన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో బెయిలు కోసం రాజ్ కాసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, దిలీప్ విజయవాడ ఏసీబీ కోర్టులో  పిటిషన్ దాఖలు చేశారు. వీరి బెయిలు పిటిషన్ల పై ఏసీబీ కోర్టు గురువారం (ఆగస్టు 28) తీర్పు వెలువరించింది.

రాజ్ కేసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి లకు బెయిలు నిరాకరించిన కోర్టు, ఇదే కేసులో ఏ30 అయిన రాజ్ కేసిరెడ్డి పీఏ దిలీప్ రెడ్డికి మాత్రం బెయిలు మంజూరు చేసింది.  ఈ కేసులో అరెస్టై విజయవాడ జైలులో ఉన్న నిందితులలో దిలీప్ ఒకరు. అతడికి ఏసీబీ కోర్టు బెయిలు మంజూరు చేయడంతో విడుదలయ్యారు. అయితే రాజ్ కరేసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డిలకు మాత్రం కోర్టు బెయిలు నిరాకరించి, వారి పిటిషన్లను డిస్మిస్ చేసింది.  రాజ్ కేసిరెడ్డి గతంలో బెయిలు కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే సుప్రీం కోర్టు బెయిలు కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని  సూచిస్తూ ఆయన పిటిషన్ ను కొట్టివేసింది.   

Online Jyotish
Tone Academy
KidsOne Telugu