లాంగ్ లీవ్ పై ఐఏఎస్ స్మితా సబర్వాల్

తెలంగాణ సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ లాంగ్ లీవ్ లో వెళ్లారు. వచ్చే ఏడాది జనవరి 31వ తేదీ వరకు అమె సెలవు పెట్టారు. సెలవుకు ఆరోగ్య కారణాలు చూపినప్పటికీ.. గత ప్రభుత్వంలో సీఎంవో లో అడిషనల్ కార్యదర్శిగా పని చేసిన స్మితా సబర్వాల్ కాళేశ్వరం ప్రాజెక్టు సహా పలు కీలక ప్రాజెక్టులలో కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

తాజాగా కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ నివేదికలో కూడా స్మితా సబర్వాల్ పై చర్యలకు సిఫారసు చేశారు. ఈ నేపథ్యంలో ఆమె లాంగ్ లీవ్ పై వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. కాగా ఆమె తన సెలవుకు కారణం గత కొంత కాలంగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు పేర్కొన్నారు. కాగా ఆమె సెలవును ప్రభుత్వం మంజూరు చేసింది.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu