అనుమతి లేకపోయినా సహరాన్ పూర్ బయలుదేరిన రాహుల్...
posted on May 27, 2017 12:19PM
.jpg)
ఉత్తరప్రదేశ్ లోని దళితులు, ఠాకూర్ వర్గాల మధ్య చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో సహరాన్ పూర్ జిల్లాలో పోలీసులు భద్రత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఉద్రిక్తతలను తగ్గించేందుకు మొబైల్ ఇంటర్నెట్, సామాజిక మాధ్యమాలను నిలిపివేశారు. అంతేకాదు అక్కడికి ప్రతిపక్ష నేతలు వెళ్లడానికి కూడా అనుమతి ఇవ్వడంలేదు. దీనిలో భాగంగానే కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అనుమతిని కూడా నిరాకరించారు. అయితే రాహుల్ గాంధీ మాత్రం.. షహరాన్‌పూర్‌ను సందర్శించాల్సిందేనని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే.. రాహుల్‌గాంధీ శనివారం షహరాన్‌పూర్‌లో పర్యటించేందుకు బయలుదేరారు. దీంతో అయితే అనుమతి లభించకపోయినా.. రాహుల్ షహరాన్‌పూర్ వెళ్తుండటంతో ఏం జరుగుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.