జన, కులగణన ఎప్పటి లోగా పూర్తి చేస్తారో చెప్పండి : రాహుల్ గాంధీ

 

 

కేంద్ర ప్రభుత్వం కులగణన చేయాలన్న  నిర్ణయాన్ని స్వాగతిస్తున్నమని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒత్తిడితోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. కాకపోతే ఎప్పటిలోగా కులగణన చేపడతారో చెప్పాలని రాహుల్ కేంద్రాన్ని ప్రశ్నించారు. కులగణన విషయంలో తెలంగాణ మోడల్ స్టేట్ గా మారిందని పేర్కొన్నారు.“మేమే పార్లమెంట్‌లో కుల గణన అవసరం అని స్పష్టం చెప్పాం. అలాగే 50 శాతం రిజర్వేషన్ పరిమితిని రద్దు చేయాలని వాదించాం. గతంలో ప్రధాని కేవలం నాలుగు కులాల గురించి మాత్రమే మాట్లాడేవారు. ఇప్పుడు ఏం జరిగిందో తెలియదు కానీ, 11 ఏళ్ల తర్వాత కుల గణన ప్రకటన వచ్చింది” అని పేర్కొన్నారు.

ఇది కేవలం తొలి అడుగేనని, కేంద్రం కుల గణనకు తమ మద్దతు ఉందని, బీహార్‌ మాదిరిగానే తెలంగాణ కూడా ఒక ఉదాహరణగా నిలుస్తుందన్నారు. కుల గణన ద్వారా రిజర్వేషన్ల పరిమితికి మించిన అభివృద్ధి మోడల్‌ను అభివృద్ధి చేయాలనేదే తమ లక్ష్యమని తెలిపారు. దేశంలో ఓబీసీలు, దళితులు, ఆదివాసీలు ఎంత మేరకు వాటాదారులై ఉన్నారో తెలుసుకోవడానికి కుల గణన కీలకమని అన్నారు.ఇక ఉగ్రవాదంపై కేంద్రం మరింత కఠినంగా వ్యవహరించాలని రాహుల్ గాంధీ కోరారు. పెహల్గామ్ దాడికి పాల్పడిన దుండగులు తగిన మూల్యం చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు. “ఉగ్రవాదంపై పోరాటానికి మా మద్దతు ఉందని రాహుల్ పేర్కొన్నారు