రోడ్డు పక్కన ఇంట్లోకి దూసుకెళ్లిన కారు..ఆరుగురు మెడికల్ విద్యార్ధులు మృతి
posted on Apr 30, 2025 8:19PM

నెల్లూరు జిల్లా కోవూరు మండలంలో పోతిరెడ్డిపాలెం వద్ద ఘోర కారు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కనే ఉన్న ఓ హోటల్‌లోకి కారు దూసుకెళ్లి ఆరుగురు మృతి చెందారు. ఈ ఘటనలో ఆ ఇంట్లో నివసిస్తున్న వెంకట రమణయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురికి గాయాలు కాగా చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మృతులంతా నారాయణ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్‌గా తెలుస్తోంది. పోతిరెడ్డిపాలెం వద్ద కారు బీభత్సం ఘటనలో మృతులు మెడిసిన్ సెకండ్ ఇయర్ చదువుతున్న నరేష్, అభిషేక్, జీవన్, యగ్నేష్, అభిసాయిలుగా పోలీసులు ప్రకటించారు. గాయపడిన నవనీత్ అనే విద్యార్థి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బుచ్చిరెడ్డిపాలెం లో ఓ నిశ్చితార్థ వేడుకకు హాజరై కారులో విద్యార్థులు తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది.
వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి హోటల్‌లోకి దూసుకెళ్లిందని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను నెల్లూరులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మరో విద్యార్థి మౌనిత్ రెడ్డి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. రెండు రోజుల క్రితం తిరుపతిలో ట్రక్ కిందకు కారు దూసుకెళ్లి కారు తిరుపతి ప్రమాదంలోనూ ఐదుగురు దుర్మరణం చెందారు. మన కార్లలో కూడా సేఫ్టీ లేకపోడంతో ప్రమాదం జరిగితే ప్రాణాలు పోవాల్సివస్తుంది. ఎయిర్ బెలూన్స్ ఉన్నా ప్రాణాలు ఎందుకు దక్కడం లేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.