ఐసిస్ తో తెగతెంపులు కుదరదు...!
posted on Jun 30, 2017 5:12PM

ఐసిస్ తో తెగతెంపులు చేసుకోవడం కుదరదని చెబుతుంది ఖతార్. అసలు సంగతేంటంటే... ఉగ్రవాద సంస్థలకు ఖతార్ అండగా నిలుస్తుందన్న ఆరోపణలు ఎప్పటినుండో ఉన్న సంగతి తెలిసిందే. ఇందుకుగాను నాలుగు అరబ్ దేశాలు ఖతార్ తో తెగదెంపులు చేసుకున్నాయి. తమతో సంబంధాలను పునరుద్ధరించుకోవలంటే... ఉగ్ర సంస్థలతో సంబంధాలను పూర్తి స్థాయిలో తెంచుకోవాలని షరతు విధించాయి. ఇక షరతులపై స్పందించిన ఖతార్.. ఐసిస్, ఆల్ ఖైదా, లెబనీస్ షియా టెర్రరిస్ట్ గ్రూపులతో తాము తెగదెంపులు చేసుకోలేమని... ఎందుకంటే ఆ గ్రూపులతో తమకు సంబంధాలే లేవని ఓ ప్రకటనలో తెలిపింది. అంతేకాదు తమను బహిష్కరించిన దేశాల డిమాండ్లను అంగీకరించాలంటే... తమకు కూడా కొన్ని కండిషన్లు ఉన్నాయని ఖతార్ తెలిపింది. అనుచితంగా ఉన్న డిమాండ్లను తమ ముందు పెట్టారని, తమకు డెడ్ లైన్ కూడా విధించారని... ఇది తమ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించడమే అవుతుందని పేర్కొంది.