జీఎస్టీ అసాధ్యమన్న మోడీ..!
posted on Jun 30, 2017 5:41PM
.jpg)
జీఎస్టీ అసాధ్యం.. ఇంకా కొద్ది గంటల్లో జీఎస్టీ లాంఛనంగా ప్రారంభంకానున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేసేది ఎవరబ్బా అనుకుంటున్నారా...? ఎవరో కాదు సాక్ష్యాత్తు ప్రధాని మోడీ. ఆశ్చర్యంగా ఉంది కదా.. ఈ వ్యాఖ్యలు చేసింది మోడీనే. కానీ ఇప్పుడు కాదులెండి. మోడీ ఒకప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో. అప్పుడు చేసిన వ్యాఖ్యలను సంబంధించిన వీడియో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పెట్టింది. ఆ వీడియోలో మోడీ.. ‘జీఎస్టీ ఎట్టి పరిస్థితిల్లోనూ విజయవంతం కాదు. సరైన మౌలికసదుపాయాలు లేకుండా దీన్ని అమలు చేయడం అసాధ్యం’ అంటూ వీడియోలో వ్యాఖ్యానించారు. ఇప్పుడు దీనిపై కాంగ్రెస్ స్పందిస్తూ...‘జీఎస్టీపై మోదీ, బీజేపీ నిజంగా ఏమనుకుంటున్నారో చూడండి’..ఒకప్పుడు జీఎస్టీ అమలు సాధ్యమన్న మోదీ.. అప్పుడే తన వ్యాఖ్యలు ఎలా మరిచిపోయారంటూ కాంగ్రెస్ మరో ట్వీట్ చేసింది. ‘మోదీ జీ.. ఇంత త్వరగా మీ మాటలు ఎలా మరిచిపోయారు అంటూ ట్వీట్ చేశారు. మరి దీనిపై బీజేపీ నేతలు ఎలా స్పందిస్తారో చూద్దాం..