సబ్ కలెక్టర్ గా పివీ సింధు...


రియో ఒలింపిక్స్ లో రజత పతకం గెలిచి భారత ఖ్యాతిని చాటిన పివీ సింధుకు సబ్ కలెక్టర్ గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ రోజు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో అసెంబ్లీ జీఎస్టీ బిల్లుకు ఆమోదం తెలిపింది. దానితో పాటు ఉద్యోగ నియామకాల చట్టంలో సవరణల బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలోనే పీవీ సింధుకు గ్రూప్‌-1 ఉద్యోగం ఇచ్చేలా బిల్లులో సవరణలు చేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ..ఒలింపిక్స్‌లో పీవీ సింధు ఎంతో ప్రతిభ చూపిందని, ఆమెకు ముందుగా ప్రకటించిన విధంగా గ్రూప్-1 ఉద్యోగంలో భాగంగా సబ్ కలెక్టర్‌గా నియమిస్తున్నామని ప్రకటించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu