జీఎస్టీ బిల్లుపై చంద్రబాబు.. వాళ్లు మారరు...
posted on May 16, 2017 11:52AM
.jpg)
ఏపీ అసెంబ్లీ జీఎస్టీ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... ఒక దేశం- ఒక పన్ను కోసమే జీఎస్టీ తీసుకొచ్చారని.. అన్ని రాష్ట్రాలు జీఎస్టీ బిల్లును ఆమోదిస్తున్నాయి.. జీఎస్టీతో కేంద్ర రాష్ట్రాలకు న్యాయం జరుగుతుందని అన్నారు. ఆర్ధిక సంస్కరణలతో దేశం ముందుకు పోయింది.. ఈబిల్లుతో దేశంలో పన్నుల సంస్కరణలు వస్తాయి..సంస్కరణల తరువాత జీఎస్టీ బిల్లు మరో అతిపెద్ద సంస్కరణ అవుతుంది.. పన్నులపై పన్నులు లేకుండా జీఎస్టీ ఉపయోగపడుతుందని అన్నారు. ఇంకా ప్రతిపక్షాలు సభలో వ్యవహరించిన తీరుపై ఆయన మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షం ప్రవర్తన విచిత్రంగా ఉంది.. వారిలో మార్పు వస్తుందని కూడా అనుకోవడం లేదు.. ఏ విషయానికి ప్రశ్నించాలో కూడా తెలియని ప్రతిపక్షం ఉందని ఎద్దేవ చేశారు.