పుష్ప షో ర‌ద్దు.. హిందూపురంలో బాక్సులు బ‌ద్ద‌లు..

అస‌లే పుష్ప. మోస్ట్ అవేటెడ్ మూవీ. బ‌న్నీ మాస్ అప్పీల్ చూసేందుకు ఫ్యాన్స్ పోటెత్తారు. థియేట‌ర్ల‌లో మెగా సంద‌డి. క‌టౌట్లు, దండ‌లు, పాలాభిషేకాలు, కేరింత‌లు.. అంతా కేక‌. ర‌చ్చ రంభోలా.

అలాంటిది.. స‌డెన్‌గా షో లేదంటే..? ఎట్టా ఉంటాది? అస‌లే హిందూపురమాయె. ఇంకెట్టా ఉంటాదో తెలుసుగా. అట్టానే జ‌రిగింది. ఫ్యాన్స్ త‌గ్గేదే లే అన్నారు. థియేట‌ర్‌ బాక్సులు బ‌ద్ద‌ల‌య్యాయి. పుష్ఫ అంటే ఫ్ల‌వ‌ర్ అనుకున్నార్రా.. ప‌వ‌ర్ అంటూ ఫ్యాన్స్ త‌మ ప‌వ‌ర్ చూపించారు. 
 
హిందూపురంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. పుష్ప సినిమా బెనిఫిట్ షో కోసం అల్లు అర్జున్ ఫ్యాన్స్  పడిగాపులు కాశారు. బెనిఫిట్ షో రద్దైనట్టు థియేటర్ యాజమాన్యం చెప్ప‌డంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. థియేటర్ల అద్ధాలు ధ్వంసం చేసి ఆందోళనకు దిగారు. థియేటర్ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు అల్లు అర్జున్ అభిమానులపై లాఠీ చార్జ్ చేసి..పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu