రక్షణ సిబ్బందికి ఆస్తి పన్ను మినహాయింపు.. పవన్ కల్యాణ్
posted on May 12, 2025 10:05AM

భారత రక్షణ దళాల్లో పనిచేసే సిబ్బందికి లబ్ధి చేకూర్చేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెంది ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, పారామిలిటరీ, సీఆర్పీఎఫ్ లలో పని చేసే సిబ్బందికి ఆస్తి పన్ను మినహాయింపు ఇస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు సరిహద్దుల్లో పనిచేసే వారికి, రిటైర్డ్ ఆర్మీ సిబ్బందికీ మాత్రమే ఈ మినహాయింపు ఉండేది. ఔను ఇప్పటి వరకూ ఆస్తి పన్ను మినహాయింపు ఉన్న వారిలో మాజీ సైనికులు, వారి జీవిత భాగస్వాములకు మాత్రమే ఈ మినహాయింపు ఉండేది. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రక్షణ దళాలలో పని చేసే ఏపీకి చెందిన వారందరికీ ఈ మినహాయింపు కల్పించింది.
సరిహద్దుల్లో దేశ రక్షణ కోసం పోరాడుతున్న వారి కోసం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పంచాయతీల్లో దేశ రక్షణ దళాలలో పని చేస్తున్న సిబ్బందికి ఈ మినహాయింపు ఇచ్చింది. పాకిస్థాన్ తో యుద్ధవాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో ఏపీ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ నిర్ణయం మేరకు మాజీ సైనికులు, ప్రస్తుతం విధుల్లో ఉన్న డిఫెన్స్ సిబ్బంది, వారి భార్య లేదా భర్త పేరు మీద ఇల్లు ఉంటే ఆస్తి పన్ను ఉండదు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ విషయం తెలిపారు. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.