అసెంబ్లీలో అచ్చెన్న, నిమ్మ‌ల మైక్ కట్..

అసెంబ్లీ ప్రివిలైజ్ క‌మిటీ స‌మావేశంలో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. సీఎం జగన్‌మోహన్ రెడ్డిని వ్య‌క్తిగ‌తంగా దూషించారనే కారణంతో టీడీపీ శాస‌న‌స‌భాప‌క్ష ఉప‌నేతలు అచ్చెన్నాయుడు, నిమ్మ‌ల రామానాయుడుకు ఈ అసెంబ్లీ స‌మావేశాలు జ‌రిగిన‌న్ని రోజులూ.. మైక్ ఇవ్వ‌కూడ‌ద‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. 

ప్రివిలైజ్ క‌మిటీ ప్ర‌తిపాద‌న‌ల‌ను క‌మిటీ స‌భ్యుడు అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్‌ తీవ్రంగా వ్య‌తిరేకించారు. రామానాయుడిని సీఎం జ‌గ‌న్‌.. డ్రామా నాయుడు అంటేనే తిరిగి రామానాయుడు మాట్లాడార‌ని గుర్తు చేశారు. కావాలంటే రికార్డుల‌ను ప‌రిశీలించుకోవాల‌ని అన‌గాని సూచించారు. అయితే, ఆయ‌న అభ్య‌ర్థ‌న‌ను ప్రివిలైజ్ క‌మిటీ ప‌ట్టించుకోలేదు.

అచ్చెన్నాయుడు, రామానాయుడికి అసెంబ్లీ స‌మావేశాల్లో మైక్ ఇవ్వ‌కూడ‌ద‌నే తీర్మానాన్ని ప్రివిలైజ్ క‌మిటీ.. స్పీక‌ర్‌కు పంపనుంది. స్పీక‌ర్ నిర్ణ‌యం తుది నిర్ణ‌యం కానుంది.
 

Related Segment News