నోట్ల రద్దుని మించిన సంచలన నిర్ణయం ముందుంది

విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ వద్ద ఉన్న విశ్వ ప్రియ ఫంక్షన్ హాల్ ప్రాంగణంలో డిజి ధన్ మేళాను కేంద్ర పట్టణాభివృద్ధి - గృహ నిర్మాణం - సమాచార ప్రసారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నోట్ల రద్దుని మించిన సంచలన ప్రకటన చేయనున్నారని చెప్పారు.

 

 

మోడీ నోట్ల రద్దు గురించి ప్రకటన చేసినప్పుడు ప్రతిపక్షాలు వ్యతిరేకించాయనీ, కానీ దాని వల్ల నల్లధనం బయటకి వచ్చిందని చెప్పారు. కొత్త నిర్ణయం కూడా వారిని ఇబ్బంది పెట్టినా అది సాధారణ జనాలకి లాభం చేకూరుస్తుందని వివరించారు. 

 

 

నల్లధనం రూపంలో కొందరు ధనవంతులు, అవినీతిపరుల చేతుల్లోనే ధనం ఉండిపోయి ఉగ్రవాదం, వేర్పాటువాదం మరియు మాదక ద్రవ్యాలు వంటివి దేశ వినాశనానికి దారి తీయడానికి కారణ భూతాలవుతున్నాయని  చెప్పారు. ఈ నేపథ్యంలో మోడీ సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుని పెద్ద నోట్ల చలామణికి చెక్ చెప్పి.. ఆర్థిక సమానత్వం దేశ ప్రజలందరికీ కల్పించే పని చేపట్టారని చెప్పారు.

 

 

కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రజలకి మంచి చేకూరే పనులు చేస్తున్నారని చెప్పారు. అయితే, మోడీ తదుపరి సంచలన ప్రకటన ఏంటో చెప్పకుండా, అవినీతిపరుల గుండెల్లో మరో బాంబు పేల్చారు వెంకయ్య!

Online Jyotish
Tone Academy
KidsOne Telugu