హిందువులకు అన్యాయం చేస్తున్న కేసీఆర్...
posted on Dec 11, 2014 10:50AM

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పాలనలో తెలంగాణ రాష్ట్రంలోని హిందువులకు అన్యాయం జరుగుతోందని విశ్వ హిందూ పరిషత్ జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా అభిప్రాయపడ్డారు. గురువారం నాడు శంషాబాద్‌లో వీహెచ్‌పీ భాగ్యనగర్ వెబ్‌సైట్‌ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రవీణ్ తొగాడియా పైవిధంగా వ్యాఖ్యానించారు. మతపరమైన రిజర్వేషనలతో ముస్లింలకు లాభం చేకూరేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని, నిజాం పాలన ఎలా వుండేదో తెలుసుకోవాలంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వున్న కేసీఆర్ పాలనను చూస్తే అర్థమైపోతుందని ప్రవీణ్ తొగాడియా అన్నారు. తెలంగాణలో కేవలం ముస్లింలకే అవకాశాలు కల్పిస్తున్నారని, వెనుకబడిన హిందువుల కుటుంబాలకు అవకాశాలు లేవని చెప్పారు. తెలంగాణ గడ్డమీద ఆనాడు నిజాం పాలనకు వ్యతిరేకంగా ఎలాంటి పోరాటం జరిగిందో, ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం మీద అలాంటి పోరాటం జరపాల్సిన అవసరం వుందని ఆయన పిలుపునిచ్చారు.