కిడ్నాప్.. కిడ్నాప్... హత్య..
posted on Dec 11, 2014 10:29AM

ఖమ్మం జిల్లాలో ఇద్దరు గిరిజనులు మావోయిస్టుల చేతిలో కిడ్నాప్‌కి గురయ్యారు. చర్ల మండలం కలివేరుకు చెందిన గిరిజనుడు మడకం తిరుపతిని మావోయిస్టులు అపహరించారు. ఛత్తీస్‌గఢ్‌లోని ఉడతమల్‌లో ఉన్న బంధువుల ఇంటికి వెళ్ళి వస్తుండగా బుధవారం సాయంత్రం మావోయిస్టులు తిరుపతిని కిడ్నాప్ చేశారు. ఇటీవలే ఖమ్మం జిల్లా ఎదుళ్ళగూడెం గ్రామానికి చెందిన మరో గిరిజనుడు సోడె రాజును కూడా మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు గిరిజనులను మావోయిస్టులు కిడ్నాప్ చేయడంతో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల జరిగిన మావోస్టుల వారోత్సవాలు జరిగిన సందర్భంగా, పోలీసులకు ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్న 15 మంది గిరిజనుల పేర్లతో మావోయిస్టులు జాబితాను విడుదల చేశారు. ఆ జాబితాలు ప్రస్తుతం కిడ్నాప్‌కి గురైన తిరుపతి, సోడె రాజు పేర్లు కూడా వున్నాయి. ఇప్పుడు ఆ జాబితాలో వున్న మిగతా 13 మంది భయంతో వణికిపోతున్నారు. ఇదిలా వుండగా మావోయిస్టులు కిడ్నాప్ చేసిన తిరుపతిని చంపేశారని సమాచారం.