అడ్డుక‌ట్ట‌లేని పోలీసుల జులుం.. టీడీపీయే ల‌క్ష్యం

ఏపీలో అధికార‌గ‌ణానికి పోలీసులు వ‌త్తాసు ప‌లుకుతున్నార‌న్న ఆరోప‌ణ‌లు మ‌రింత రుజువ‌వుతున్నా యి. ఇటీవ‌లికాలంలో పోలీసులు ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తూ, విచ‌క్ష‌ ణార‌హితంగా విప‌క్ష టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌ మీదా దాడులు చేస్తున్నార‌ని తీవ్ర ఆరోప‌ణ‌లు ఉన్నాయి. చూడ‌ బోతే ప్ర‌భుత్వ యం త్రాంగం పోలీసు ల‌కు మ‌ద్ద‌తునిస్తున్న‌ద‌న్న ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతు న్నాయి. 

కుప్పం నియోజకవర్గంలో టీడీపీ నేతలు, కార్యకర్తల అరెస్ట్‌లు మొదలయ్యాయి.  ఎమ్మెల్సీ గౌనివారి శ్రీని వాసులు మరో ఇద్దరు నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే  రామకుప్పం మండలం మాజీ జడ్పీటీసీ సభ్యుడు మునుస్వామిని అరెస్ట్ చేశారు. టీడీపీ నేతల అక్రమ అరెస్ట్ లను పార్టీ అధినేత చంద్ర బాబు తీవ్రంగా ఖండించారు. అక్రమ అరెస్టులకు నిరసనగా టీడీపీ శ్రేణులు ఆందోళనలకు సిద్ధ మవుతు న్నాయి.

తెలుగుదేశం కార్య‌క‌ర్త‌లమీద  లాఠీలు విసిరి, కేసులు పెట్టి, దూకుడుగా వెళ్లడమే లక్ష్యంగా పెట్టుకుంద‌ని టీడీపీ ఆరోపిస్తున్న‌ది.  రాష్ట్రంలో జరుగుతున్న వరుస సంఘటనలను చూస్తే అవున‌నే అనే సమాధాన మే లభిస్తోంది. వైసీపీ ఆడుతున్న రాజకీయ చదరంగంలో పోలీసులు పావులుగా మారారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.  

కుప్పం నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే గేమ్ మొదలు పెట్టిందనే టాక్ బలంగా నడు స్తోంది. ఇప్పటికే అరాచకంతో కుప్పంలో ప్రశాంత వాతావరణాన్ని మార్చేసి ఆ ప్రాంతాన్ని వైసీపీ కార్య కర్తలు రణరంగంగా మార్చారు. పోలీసులు సైతం వీరికి అండగా నిలిచారని టీడీపీ విమర్శిస్తోంది. తాజాగా టీడీపీ కార్యకర్తల అరెస్ట్‌కు వైసీపీ పెద్దలు పోలీసులను ఉసిగొల్పుతున్నారని బాహాటంగానే విమ ర్శలు వినవస్తు న్నాయి.