కేటీఆర్, హరీష్ అరెస్ట్
posted on Aug 30, 2025 4:16PM
.webp)
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు, ఆ పార్టీ కీలక నేత మాజీ మంత్రి హరీష్ రావులను పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు శనివారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. తొలి రోజు అసెంబ్లీ సమావేశాలు సంతాపతీర్మానాలకే పరిమితమయ్యాయి. సంతాప తీర్మానాలను ఆమోదించిన తరువాత సభ వాయిదా పడింది. అసెంబ్లీ నుంచి నేరుగా సెక్రటేరియట్‌కు చేరుకున్నకేటీఆర్, హరీష్ రావులు రైతుల సమస్యలపై ఆందోళనకు దిగారు.
పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, అనుచరులతో కలిసి సెక్రటేరియెట్ ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు కేటీఆర్, హరీష్ రావు సహా పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ పోలీసు వాహనం లోంచే మీడియాతో మాట్లాడారు. యూరియా దొరకక రైతులు ఆత్మహత్యలే గతి అనుకునే పరిస్థితికి వచ్చారనన్నారు. యూరియా కొరతను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పోలీసులు అరెస్టు చేసిన కేటీఆర్, హరీష్ రావులను ఖైరతాబాద్ పోలీసు స్టేషన్ ను తరలించారు.