మోడీ, రామోజీల భేటీ.. సూటు.. బూటులో రామోజీ
posted on Dec 8, 2015 9:43AM

మీడియా మొఘల్ రామోజీరావు ప్రధాని నరేంద్ర మోడీతో ఢిల్లీలో భేటీ అయి కాసేపు ముచ్చటించారు. అయితే సాధారణంగా ప్రముఖులు భేటీ అయి ముచ్చటిస్తే ఎవరైనా ఏం మాట్లాడుకున్నారు అని పలువురు ఆసక్తికరంగా మాట్లాడుకుంటారు. కానీ ఇక్కడ రామోజీరావు, నరేంద్ర మోడీ ఇద్దరు కలిసి ముచ్చటించినా.. ఇప్పుడు అందరూ మాట్లాడుకునేది మాత్రం రామోజీ డ్రస్ గురించి. మామూలుగా అయితే రామోజీరావు ఎప్పుడు వైట్ అండ్ వైట్ లోనే ఉంటారు. చాలా మందికి ఆయన ఆ డ్రస్సింగ్ తోనే తెలిసిఉంటారు. దీంతో ఎప్పుడూ వైట్ అండ్ వైట్ లో ఉండే రామోజీ ప్రధాని నరేంద్ర మోడీని కలవడానికి మాత్రం.. సూటు వేసుకొని దానికి టై కూడా పెట్టుకున్నారు. ఇంత విభిన్నంగా డ్రస్సింగ్ అయ్యి రామోజీరావు మోడీని కలవడం చాలా విచిత్రంగా ఉంది. అయితే ఇంతకీ వీరిద్దరూ ఎందుకూ కలిశారంటే.. ఈనాడు.. ఈ టీవీ సంస్థల అధ్వర్యంలో చేపట్టిన స్వచ్ఛ భారత్.. స్వచ్ఛ ఆసుపత్రి కార్యక్రమాల్ని వివరించారట. దీనికి సంబంధించిన కొన్ని డీవీడీలు.. పుస్తకాలు కూడా మోడీకి అందించారట. మొత్తానికి రామోజీ మోడీని కలవడం వెనుక ఇదే ఉందో.. ఇంకేదైనా ఆంతర్యం ఉందో..