లోకేశ్ విషయంలో పార్టీ నేతలు అనుకున్నదే జరిగిందా..?
posted on Dec 7, 2015 5:02PM

గ్రేటర్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణ టీడీపీ నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రచారంలో పాల్గొంటారా? లేదా?అనే దానిపై అనుమానాలు వస్తునే ఉన్నాయి. ఉప ఎన్నికల్లో కూడా ప్రచారంలో పాల్గొనని ఆయన ఈసారి గ్రేటర్ ఎన్నికల్లో కూడా పాల్గొనే అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కానీ ఇప్పుడు ఆ అనుమానాలకు కొంచెం క్లారిటీ వచ్చినట్టు కనిపిస్తుంది తాజా పరిణామాలు చూస్తుంటే. ఎందుకంటే.. ఈ గ్రేటర్ ఎన్నికల్లో చంద్రబాబు తన తనయుడిని ముందుకు తీసుకురావాలని చూస్తున్నారంట. మొదట ఈ విషయంలో చంద్రబాబు కన్ఫ్యూజన్లో ఉన్న ఇప్పుడు మాత్రం ఈ గ్రేటర్ ఎన్నికల బాధ్యతను లోకేశ్ కు అప్పగిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపైన ఇకనుండి లోకేశ్ తోనే చర్చించాలని.. పార్టీనేతలకు చంద్రబాబు సూచించారట. అంతేకాదు గ్రేటర్ ఎన్నికల పరిధిలో తనకున్న ఎక్స్ పీరియన్స్ ను కూడా లోకేశ్ కు చంద్రబాబు చెప్పారంట. ఇంకా అవసరమైతే పార్టీలోని సీనియర్ నేతల సలహాలు కూడా తీసుకోమని చెప్పారంట. దీంతో గ్రేటర్ ఎన్నికల్లో ఇక పార్టీని ముందుండి నడిపేది లోకేశే అని గట్టిగా వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఈ ఎన్నికల కోసం గాను లోకేశ్ ఏపీలోని పార్టీ కార్యక్రమాలను సైతం పక్కన పెట్టారంట. మొత్తానికి టీడీపీ నేతలు అనుకున్నట్టే లోకేశ్ గ్రేటర్ ఎన్నికల బాధ్యత తీసుకున్నాడు. మొత్తానికి వారు అనుకున్నది సాధించారు.