బాలకృష్ణకు షాక్.. కన్వీనర్ రంగారెడ్డి రాజీనామా
posted on Dec 8, 2015 10:07AM

హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు తన నియోజకవర్గంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఎంతోకాలం పాటు పార్టీని అంటిపెట్టుకుని ఉన్న చిలమత్తూరు మండల కన్వీనర్ రంగారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. అయితే దీనికి కారణం బాలకృష్ణ వ్యక్తిగత కార్యదర్శి శేఖరే కారణమని తెలుస్తోంది. దీంతో శేఖర్ వ్యవహార శైలి మరోసారి బయటకు వచ్చింది. గతంలో కూడా శేఖర్ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నాడంటూ ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు ఎలాంటి హోదా లేకపోయినా అధికార, అనధికార కార్యక్రమాల్లో తానే ఎమ్మెల్యేగా వ్యవహరిస్తుండటంతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులకు సరైన ప్రాధ్యాన్యత ఇవ్వకపోవడంతో శేఖర్ పై పార్టీ నేతలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి బాలకృష్ణ అతనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.