ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎమ్మెల్సీ కవిత పీఏకు నోటీసులు
posted on Jun 28, 2025 11:02AM
.webp)
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తవ్విన కొద్దీ సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల సిట్ విచారణకు హాజరైన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ డీఎస్పీ ప్రణీత్ రావు ఫోన్‌లో ఎమ్మెల్సీ కవిత వ్యక్తిగత సహాయకుడికు సంబంధించిన పలు ఆడియో రికార్డింగ్స్ బయటపడ్డాయి. దీంతో సిట్ అధికారులు కవిత పీఎను విచారణకు రావాలంటూ ఇవాళ నోటీసులు జారీ చేశారు. అదేవిధంగా పలువురు బీఆర్ఎస్ నేతలకు కూడా నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే పలువురు వీఐపీల వాంగ్మూలాలను అధికారులు రికార్డ్ చేసిన విషయం తెలిసిందే.
మరోవైపు 2022లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై సిట్ ఫోకస్ సిట్ ఫోకస్ చేసింది. మాజీ సీఎం కేసీఆర్ రిలీజ్ చేసిన ఆడియోలపై సిట్ అధికారుల ఆరా తీస్తున్నారు. కేసీఆర్ విడుదల చేసిన ఆడియో రికార్డింగులు ఎక్కడి నుంచి వచ్చాయి అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారానే కాల్స్ రికార్డ్ చేసినట్లు ప్రాథమిక అంచనా వేసినట్లు తెలుస్తోంది. ఏ సర్వర్ నుంచి ఆడియోలు పెన్ డ్రైవ్ లోకి వచ్చాయి అనే దానిపై అధికారులు దృష్టి సారించారు. మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీరం హర్షవర్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, పైలెట్ రోహిత్ రెడ్డిని ప్రలోభలకు గురిచేసిన ఆడియోలు అప్పట్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే