తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి.. దర్యాప్తు నివేదికను సుప్రీంకు సమర్పించిన సిట్

తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ  ప్రసాదం తయారీకి వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిందన్న చంద్రబాబు ఆరోపణ  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.  దీనిపై తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నియమించిన సిట్ ను కాదని.. సుప్రీం కోర్టు సీబీఐ ఆధ్వర్యంలో స్వతంత్ర సిట్ ను నియమించింది.  ఆ సిట్ దర్యాప్తులో  ఇప్పుడు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.  అత్యంత పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదం కోసం వైసీపీ హయాంలో సరఫరా చేసినది కల్తీ నెయ్యి అనడానికి కూడా లేదనీ, ఎందుకంటే అది  అసలు నెయ్యే కాదని సిట్ దర్యాప్తులో తేలింది. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు నియమించిన సీబీఐ ఆధ్వర్యంలోని సిట్ కోర్టుకు తెలిపింది. కెమికల్స్‌తో నెయ్యిలా కనిపించే మిశ్రమాన్ని తయారు చేసి బోలేబాబా డెయిరీ వాటిని వైష్ణవి, ఏఆర్ డెయిరీల పేరుతో టీటీడీకి సరఫరా చేసిందని  సిట్ స్పష్టం చేసింది.   ఈ కేసు   దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం సుప్రీం కోర్టుకు శుక్రవారం (జూన్ 27) నివేదిక సమర్పించింది. ఆ నివేదికలో తన దర్యాప్తులో ఇంత వరకూ వెలుగులోకి వచ్చిన అంశాలతో కూడిన నివేదికను దేశ సర్వోన్నత న్యాయస్థానానికి   సిట్ సీల్డ్ కవర్ లో  అందజేసింది. 

 ఆ నివేదికలో  సిట్ తన దర్యాప్తులో  ఇప్పటివరకు సాధించిన పురోగతిని, నిందితులు వివిధ న్యాయస్థానాలలో దాఖలు చేసిన పిటిషన్ల వివరాలను  సమగ్రంగా పొందుపరిచినట్లు తెలుస్తోంది.  కేసు దర్యాప్తునకు  నిందితులు స‌ృష్టించిన,  సృష్టిస్తున్న అడ్డంకులపై కూడా ఆ నివేదికలో సిట్ పొదుపరిచినట్లు సమాచారం.   అలాగే   నిందితులు సాక్షులను బెదిరింపులకు గురి చేస్తున్నారని కూడా సిట్ పేర్కొన్నట్లు చెబుతున్నారు.  

వైసీపీ హయాంలో శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని కూడా కల్తీ చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించి నప్పుడు వైసీపీ నేతలు భగ్గుమన్నారు. దేవుడిని కించ పరుస్తున్నారని ఆరోపించారు. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఎంతకైనా తెగించేందుకు సిద్ధపడ్డారు. విచారణ ఎంత లోతుగా జరిగినా నిజాలు బయటకు రావనీ, ఎవరూ నోరు విప్పరనీ, తమంటే  ఇప్పటికీ టీటీడీ అధికారులలోనూ, ప్రజలలోనూ వైసీపీ హయాంలో శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని కూడా కల్తీ చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించి నప్పుడు వైసీపీ నేతలు భగ్గుమన్నారు. దేవుడిని కించ పరుస్తున్నారని ఆరోపించారు. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఎంతకైనా తెగించేందుకు సిద్ధపడ్డారు. విచారణ ఎంత లోతుగా జరిగినా నిజాలు బయటకు రావనీ, ఎవరూ నోరు విప్పరనీ, తమంటే   ఇప్పటికీ టీటీడీ అధికారులలోనూ, ప్రజలలోనూ  తామంటే భయం ఉందపి భావించారు.

అయితే..  చేసిన పాపం ఎప్పటికైనా బయటపడక తప్పదనీ,  అందులోనూ తిరుమల దేవుడి విషయంలో చేసిన అపచారానికి ఎంతటి వాడికైనా శిక్ష తప్పదనీ, ఎవరైనా కర్మఫలం అనుభవించకతప్పదనీ ఇప్పుడు తెలిసివస్తోంది. ఎందుకంటే.. ఇప్పుడు సిట్ విచారణలో తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగానికి సంబంధించి అన్ని విషయాలూ వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడు సిట్ ఇంత వరకూ తన దర్యాప్తు నివేదికను సుప్రీం కోర్టుకు సమర్పించడంతో కల్తీ నెయ్యి వ్యవహారంలో సూత్రాధారులు, పాత్రధారులూ ఎవరన్నది బయటకు రావడం ఖాయమని అంటున్నారు.