అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన అమ్మ.. కేబినెట్ భేటీ నుంచి హైదరాబాద్ వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్

తన తల్లి అంజనాదేవి అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరిన సంగతి తెలియడంతో కేబినెట్ భేటీలో ఉన్న ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు.  ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన మంగళవారం (జూన్ 24) కేబినెట్ సమావేశం జరుగుతోంది. ఆ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా హాజరయ్యారు.

ఈ భేటీలో పలు కీలక అంశాలపై కేబినెట్ చర్చించనుంది. అయితే కేబినెట్ సమావేశం మొదలైన కొద్ది సేపటికే పవన్ కల్యాణ్ తల్లి అంజనాదేవి అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం వచ్చింది. దీంతో ఆయన సీఎంకు, సహచర మంత్రులకు విషయం చెప్పి హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు.