పిల్లల పేర్లు విషయంలో కూడా సమన్యాయం..!
posted on Nov 2, 2017 11:58AM
.jpg)
పవన్ కళ్యాణ్ ఏం చేసినా కాస్త విభిన్నంగానే చేస్తాడు. అందుకే పవన్ ను సినీ హీరోగా కంటే.. ఓ వ్యక్తిగానే ఎక్కువ మంది అభిమానిస్తుంటారు. అలాంటి పవన్ కళ్యాణ్ ఆఖరికి పిల్లల పేర్లు విషయంలో కూడా సమన్యాయం పాటిస్తాడన్న విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. పవన్ కళ్యాణ్ కు నలుగురు పిల్లలు. రేణూ దేశాయ్ కు పుట్టిన పిల్లల పేర్లు అకీరా నందన్, ఆద్యా. ఆ తరువాత పెళ్లి చేసుకున్న లెజినోవాకి ముందు పాప పుట్టగా.. ఇటీవల బాబు పుట్టాడు. ఇక తనకు పుట్టిన కొడుకుకు ‘మార్క్ శంకర్ పవనోవిచ్ కొణిదెల’ అని పేరు పెట్టినట్టు వార్తలు బయటకు వచ్చాయి. అంతేకాదు ఈ పేరు వెనుక ఒక కధ కూడా వినిపిస్తుంది. పవన్ భార్య అన్నా లెజినోవా మత సంప్రదాయాలకు విలువ ఇచ్చి పవన్ వారి బిడ్డకు ఈ పేరు పెట్టాడట. లెజినోవా రష్యన్ ఆర్థోడక్స్ మత సంప్రదాయాలను పాటిస్తారు. దీంతో క్రైస్తవ మతంలో బాగా ప్రాచుర్యం పొందిన ‘మార్క్’ ను... చిరంజీవి అసలు పేరు శివశంకర్ వరప్రసాద్ నుంచి ‘శంకర్’ను తీసుకొని.. పవన్ పేరును పవనోవిచ్ అని మార్చి… పూర్తిగా ‘మార్క్ శంకర్ పవనోవిచ్’ అని పెట్టారట. ఇక కూతురికి పెట్టిన పేరు కూడా అలానే పెట్టారట. పవన్ కు లెజినొవాకు పుట్టిన కూతురి పేరు ‘పొలెనా అంజనా పవనోవా’. తన తల్లి అంజనాదేవి నుంచి ‘అంజన’ను తీసుకొని.. తన పేరులోని పవన్‌ను పవనోవాగా మార్చి ‘పొలెనా అంజనా పవనోవా’ అని పెట్టారు. మొత్తంమ్మీద పవన్ కళ్యాణ్ పేర్లు పెట్టడంలో కూడా సమన్యాయం పాటిస్తున్నట్లు కనిపిస్తుంది.