రాహుల్ ట్వీట్లు చేస్తుంది ఓ కుక్కనా..?
posted on Nov 2, 2017 11:24AM

ఈ మధ్య కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి కాస్త మెచ్యూరిటీ పెరిగినట్టు ఉంది. ఏ విషయంపై స్పందించినా కాస్త ఘాటుగానే స్పందిస్తున్నాడు... తనపై కామెంట్లు చేస్తున్న ప్రతిపక్షానికి కూడా ఘాటుగానే రిప్లైలు ఇస్తున్నాడు. ప్రతిపక్షంపై, మోడీపై పంచ్ ల మీద పంచ్ లు వేస్తుండటంతో.. రాహుల్ గాంధీపై ఉన్న పప్పు ముద్ర త్వరలోనే చెరిగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడి వరకూ బాగానే ఉన్నా.. ప్రస్తుతం రాహుల్ గాంధీ ట్విట్టర్ అకౌంట్ పై రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే కదా.. దీనిపై కాంగ్రెస్, బీజేపీ మధ్య పెద్ద వారే నడిచింది. రాహుల్ దూసుకుపోతున్నారని ఓ జాతీయదినపత్రిక చెబితే.. అంతా ఫేక్ అని.. ట్విట్టర్ లో రాహుల్ ఫాలోవర్స్ అంతా ఫేక్.. డబ్బులు పెట్టి ఫాలోవర్స్ ను కొన్నారని బీజేపీ ఆరోపించింది.
ఇక దీనికి గాను అదే ట్విట్టర్ వేదికగా రాహుల్ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాడు. రాహుల్ దెబ్బకు బీజేపీకి మైండ్ బ్లాంక్ అయిందనుకోండి. అంతలా రాహుల్ ఏం చేశాడనుకుంటున్నారా..? తన పెంపుడు కుక్క వీడియో ఒకటి పెట్టి.. దాని కింద.. రాహుల్ ట్విట్టర్ లో ట్వీట్లు పెడుతున్నది ఎవరు అని కొందరు అడుగుతున్నారు కదా..? అది నేనే అని.. నా పేరు పిడి.. రాహుల్ పెంపుడు కుక్కని…నేను అతని కంటే స్మార్ట్.. ట్వీట్ తో పాటు ఇంకా ఏం చేయగలనో చూడండి అంటూ ముక్కుపై పెట్టిన బిస్కెట్ అందుకుని తినే వీడియో ట్విట్ చేశారు. ఇంకేముంది రాహుల్ సమాధానానికి బీజేపీకి దిమ్మతిరిగిపోయింది. ఇప్పుడు ఈ ట్వీట్ తో తన మెచ్యూరిటీని చూపించుకున్నారని సీనియర్ పొలిటీషియన్లు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి రాహుల్ ఈమధ్య తన మాటలతో, పంచ్ డైలాగ్స్ తో దూసుకుపోతున్నాడు. ఇలానే ఉంటే కాంగ్రెస్ పార్టీకి కాస్త ధైర్యం చేకూరినట్టే...