ప్రతిజ్ఞ చేయించిన పవన్...
posted on May 16, 2017 5:46PM
.jpg)
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంతకాలం పరోక్ష రాజకీయాల్లో మాత్రమే పాల్గొంటూ వచ్చారు. అయితే ఈసారి మాత్రం ప్రతక్ష రాజకీయాల్లోకి రావడాని సర్వం సిద్దం చేసుకుంటున్నారు. దానికి ఇప్పటినుండే కసరత్తులు కూడా మొదలుపెడుతున్నారు. ఇప్పటికే అనంతపురం జిల్లా నూతన నాయకులతో సమావేశమైన ఆయన తాను వచ్చే ఎన్నికల్లో అనంతపురం నియోజకవర్గం నుంచే పోటీలోకి దిగుతానని క్లారిటీ ఇచ్చారు. అనంత నుంచి త్వరలో తన పాదయాత్ర మొదలు పెడతానని సంచలన ప్రకటన చేశారు.
ఇప్పుడు మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు పవన్ కళ్యాణ్. తన ఆఫీస్ లో 13 జిల్లా ల అభిమాన సంఘాల నాయకుల సమావేశం ఏర్పాటు చేసిన ఆయన అందులో భాగంగా... " సేవా దళ్" అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలకు చెందిన అభిమాన సంఘాల నాయకులతో మొదటి విడత సేవాదళ్ పేరుతో ఓ దళాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేయడానికే ఈ దళాన్ని ఏర్పాటు చేసినట్టు ప్రటించారు. దానితో పాటు జనానికి సేవ చేసేందుకు ఏర్పాటు చేసిన ఈ దళానికి సంబంధించి 10 అంశాలతో కూడిన ఓ నియమావళిని కూడా పవన్ విడుదల చేశారు. అంతేకాదు ప్రతి కార్యకర్తా ఈ నియమావళిని పాటించాలని అందరితో ప్రతిజ్ఞ కూడా చేయించారు. తొలి విడతగా జిల్లా స్థాయిలో వంద మంది కార్యకర్తలతో జనసేన సేవాదళ్ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి.. ఆ తరువాత మండల, గ్రామస్ధాయి కమిటీలు ఏర్పాటు చేస్తాం అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
పవన్ ప్రతిజ్ఞ చేయించిన అంశాలు ఇవే...
సేవాదళ్ నిమయాలు
1. ప్రతి సేవాదళ్ కార్యకర్త సేవ-సమస్యల పరిష్కారమే పరమావధి అన్న భావం కలిగి ఉండాలి..
2. సోదర కార్యకర్తలతో సుహృద్భావ సంబంధాలు కలిగి ఉండాలి..
3. విపులంగా, దూరదృష్టితో సమస్యల పరిష్కారం, ఫలితాల సాధనకు సమాయత్తం కావాలి..
4. ఇతరుల్ని సేవాదళ్ పట్ల ఆకర్షితులయ్యే విధంగా సమ్మోహన పరచాలి..
5. భావదారిద్ర్యాన్ని, సంకుచిత భావాల్ని ఆదిలోనే అరికట్టాలి..
6. కుల,మత, వర్గ, ప్రాంతీయ బేధాలు దరిచేరనివ్వకూడదు..