స్పందించిన పవన్.. ఏపీ సర్కార్ సమాధానం చెప్పాల్సిందే...!
posted on May 8, 2017 11:47AM
.JPG)
టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) ఈవో గా ఉత్తరాదికి చెందిన అనిల్‌కుమార్ సింఘాల్ నియామకంపై దక్షిణాది రాష్ట్రాల ఐఏఎస్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు దీనిపై ఓ ఐఏఎస్ అధికారి స్పందించి...టీటీడీ ఈవో పదవి విషయంలో జనసేన నేత, ప్రముఖ హీరో పవన్ కల్యాణ్ ఎందుకు నోరు విప్పడం లేదని.. గతంలో చాలా విషయాల్లో కేంద్రంపై ప్రశ్నలు వర్షం కురిపించిన పవన్ ..ఈ విషయంలో ఎందుకు మాట్లాడటం లేదన్నారు. అయితే ఇప్పుడు దీనిపై పవన్ కళ్యాణ్ స్పందించారు. తితిదే ఈవోగా ఉత్తరాదికి చెందిన ఐఏఎస్‌ను ఎందుకు నియమించాల్సి వచ్చిందో దక్షిణాది ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన ట్విటర్ ద్వారా డిమాండ్ చేశారు. అంతేకాదు తితిదే ఈవోగా ఉత్తరాదికి చెందిన అధికారి బాధ్యతలు చేపట్టడాన్ని తాను వ్యతిరేకించనని.. కానీ ఉత్తరాదిలోని అమర్‌నాథ్, వారణాసి, మధుర లాంటి దేవాలయాల్లో దక్షిణాదికి చెందిన వారిని ఎందుకు అధికారులుగా నియమించడం లేదని పవన్ ప్రశ్నించారు. మరి దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.