ఓపిక పట్టు.. జాక్ పాట్ కొట్టు.. సేనాని సంయమనం కథ!
posted on Sep 20, 2025 3:40PM

ఇది నిజంగా ఒక విజయ గాథ. ప్రస్తుతం శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ గా నియమితులైన కొట్టేసాయి.. అప్పట్లో నిజంగానే సీఐ అంజూ యాదవ్ చేతిలో చెంపదెబ్బ కొట్టించుకున్నారు. ఆ అవమాన భారం ఆయన్ను ఎంతకీ వదల్లేదు. ఎందుకంటే అది పబ్లిక్ లో జరిగింది. దానికి తోడు వీడియోల్లోనూ రికార్డయ్యింది. కానీ కాలం అన్నీ చూస్తూనే ఉంటుంది. ఆ శివయ్య కూడా సరిగ్గా అదే సమయంలో ఓర్పు వహించు నీకూ మంచి కాలం వస్తుందని అభయమిస్తుంటాడు. మనమే దాన్ని గ్రహించాల్సి ఉంటుందని సాయి అలా ఓపిక పడుతూ వచ్చారు.
ఈలోగా రాష్ట్రంలో రాక్షస పాలన అంతమై కూటమి పాలన మొదలైంది. జనసేనాని తొలిచూపు.. కొట్టే సాయి వైపు మళ్లింది. అప్పుడు పార్టీ కోసం చెంప దెబ్బ తిన్న నేతకు ఏదైనా సాయం చేస్తే మేలనిపించింది. వెంటనే కొట్టేసాయిని అదే ఆలయం చైర్మన్ గా చేశారు. ఈ మధ్య కాలంలో సేనాని పదే పదే ఇదే మాట అంటున్నారు. ఇటీవల మచిలీపట్నం ఉదంతం తీస్కుంటే, సేనాని ఇదే చెప్పారు. మీరెవరూ చట్టాన్ని చేతిలోకి తీస్కోవద్దు. అంతా చట్ట ప్రకారమే వెళ్దాం. కాస్త సంయమనం వహించమని అనడం మాత్రమే కాదు తన శ్రేణులను ఉద్దేశించి.. పెద్ద ఎత్తున ట్వీట్ లెటర్ రాశారు కూడా.
ఇప్పుడు కొట్టే సాయి రూపంలో.. అదే నిరూపించారు. సంయమనం వహిస్తే కఠిన కాలం కరుగుతుంది. అదృష్టకాలం వరిస్తుంది. ఇదిగో ఇలాంటి పదవులు సైతం పొందే అవకాశం లభిస్తుంది. కాబట్టి ఓపిక పట్టు జాక్ పాట్ పట్టు అన్నది ఇందు మూలంగా మనం నేర్చుకోవల్సిన పాఠంగానూ తెలుస్తోంది.