అయ్యో జగన్.. ఉన్న ఎమ్మెల్యే పదవి కూడా ఊస్టింగేనా!?
posted on Sep 20, 2025 3:30PM

నేను అసెంబ్లీకి రాను. కావాలంటే మీరు వెళ్లండి. అవసరమైతే మీకు పెద్దిరెడ్డినిచ్చి పంపిస్తా! అంటూ తన ఎమ్మెల్యేలతో అన్నారు జగన్. అంతే కాదు మనమంతా కలసి.. ఆ 11 సీట్లకు కూడా రాజీనామా చేసేద్దాం.. నేనైతే ఎంపీగా పోటీ చేస్తా అంటూ ట్విస్ట్ ఇచ్చేసరికి పక్కనే ఉన్న అవినాష్ రెడ్డి ఒక్కసారిగా అదిరిపడ్డారట. ఇదేందిదీ..... ఉరుము ఉరిమి మం*లం మీద పడ్డట్టు నా మీద పడ్డాడేంటని ఒక్కసారిగా కంగారు పడ్డారట భారతీరెడ్డి బావ అవినాష్ రెడ్డి.
అంతే కాదు.. హీరో, విలన్ కొట్టుకుని మధ్యలో కమెడియన్ని చంపేసినట్టు.. నన్నిలా టార్గెట్ చేశారేంటని అవినాష్ లోలోన తెగ కుమిలిపోతున్నారట.
ఇదంతా ఇలా ఉంటే.. జగన్ గానీ, ఒక వేళ పులివెందుల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. అవినాష్ చేత కడప ఎంపీగా రిజైన్ చేయించి.. ఆ ఎంపీ పోస్టుకు తాను పోటీ చేశారే అనుకుందాం. ఆబ్వియస్ గా అవినాష్ పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తుండొచ్చు.
ఓకే ఇన్నాళ్లు వైయస్ ఫ్యామిలీ నుంచి కాకుండా అదే ఫ్యామిలీ అయినా కాస్త దూరపు మనిషి ఒకరు ఈ సీటు నుంచి పోటీ చేశారే అనుకుందాం.. మొన్నటి జెడ్పీ ఎన్నికల్లో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. దీంతో పులివెందులలో వైయస్ పులి.. గాండ్రిపునకు బదులు.. మియాం మియాం అని అరిస్తే పరిస్థితేంటి? అంతే కాదు.. ఇటు ఉన్నదీ బాయె అటు ఉం* కున్నదీ పాయె అన్నట్టుగా మారే సీన్ ఎదురవుతుంది. దీంతో జగన్ కండీషన్ అడకత్తెరలో పోకచెక్కగా మారుతుందని అంటారు విశ్లేషకులు.
ప్రెజంట్ జగన్ స్కెచ్ ఏంటంటే.. తానుగానీ ఎంపీగా పోటీ చేస్తే ఇక్కడకు కేంద్ర బలగాలు దిగుతాయని.. జనంలోని వ్యతిరేకత కూడా బయట ప్రపంచానికి తెలుస్తుందని ఆయన ఆలోచనగా తెలుస్తోంది.
రిస్క్ తీస్కోవడం మంచిదే! కాదనడం లేదు. కానీ, నీటిలోని ముసలి.. అధికారంలో ఉన్న పార్టీ మోస్ట్ పవర్ఫుల్ గా ఉంటాయి. పులివెందులలో మొన్న ఎలాంటి సీన్ జరిగిందో.. సేమ్ టూ సేమ్ సీన్.. వచ్చే ఉప ఎన్నికల్లోనూ జరిగితే.. జగన్ 2. 0 అనే ఆశల్లోంచి 2 ఎగిరిపోయి.. కేవలం జీరో మిగిలితే.. !!!ఊహించుకోడానికే భయమేస్తోంది జగనన్నా.. తగ్గు తగ్గు.. అన్నది వైసీపీ కేడర్ అలెర్ట్ గా తెలుస్తోంది.