షాకింగ్.. మంత్రి పరిటాల సునీత పోటీకి దూరం

 

మంత్రి పరిటాల సునీత తనయుడు శ్రీరామ్‌ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ ఎన్నికల్లో సొంత నియోజకవర్గం రాప్తాడు నుంచి టీడీపీ అభ్యర్థిగా శ్రీరామ్‌ను బరిలోకి బరిలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. నిజానికి రాప్తాడు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా మంత్రి పరిటాల సునీత పేరును అధిష్టానం ఇప్పటికే ఖరారు చేసింది. అయితే.. ఆమె మాత్రం కుటుంబ సభ్యులు, పరిటాల అభిమానుల ఆకాంక్ష మేరకు తనయుడు శ్రీరామ్ పోటీ చేస్తాడని ప్రకటించారు. తమ కుటుంబానికి రెండు స్థానాల్లో అవకాశం కల్పించమని అడుగుతున్నామని.. కుదరని పక్షంలో శ్రీరామ్ తనకు బదులుగా రాప్తాడు నుంచి పోటీ చేస్తారని ఆమె స్పష్టం చేశారు. తన నిర్ణయాన్ని అధినేత దృష్టికి తీసుకెళతానని, సీఎం నిర్ణయం తమకు శిరోధార్యమని పరిటాల సునీత తెలిపారు. గత ఎన్నికల నుంచి పార్టీ వ్యవహారాల్లో పరిటాల శ్రీరామ్‌ క్రియాశీలంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. కార్యకర్తలకు, నేతలకు ఆయన అందుబాటులో ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu