గ్రీన్ కార్డ్ రూపంలో వలసదారులకు మరో షాక్....
posted on Feb 8, 2017 11:04AM

ఇప్పటికే ఏడు ముస్లిం దేశాలపై నిషేదం విధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలసదారులకు షాకివ్వగా.... ఇప్పుడు మరో షాక్ తగలనుంది. ఇప్పుడు గ్రీన్ కార్డ్ రూపంలో వలసదారులకు షాక్ తగలనుంది. రిపబ్లికన్ సెనేటర్ టామ్ కాటన్, డెమోక్రటిక్ పార్టీకి చెందిన సెనేటర్ డేవిడ్ పెర్‌డ్యూ అమెరికాలో ఉండే వలసదారులను సగానికి తగ్గించాలని ప్రతిపాదిస్తూ బిల్లు రూపొందించారు. అమెరికాలో స్థిరనివాసం కోసం అందజేస్తున్న గ్రీన్ కార్డులను 10లక్షల నుంచి 5 లక్షలకు తగ్గించాలని బిల్లులో ప్రతిపాదించారు. ఇప్పుడు ఈ బిల్లు ద్వారా అమెరికాలో ఉంటున్న వలసదారులకు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ బిల్లు కనుక ఆమోదం పొందితే అమెరికాలో ఉండేందుకు వెళ్లిన వారిపై ప్రభావం తీవ్రంగా పడనుంది. ప్రస్తుతం అమెరికాలో భారతీయులు గ్రీన్‌కార్డు పొందడానికి వేచి ఉండాల్సిన సమయం సుమారు 10 ఏళ్ల నుంచి 35ఏళ్ల దాకా ఉండగా.. ఈ బిల్లు చట్టమైతే భారతీయులు గ్రీన్‌కార్డు కోసం వేచి ఉండాల్సిన సమయం ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది.