విమానంలో నిద్రపోయిన పైలట్..గాల్లో 305 మంది

305 మంది ప్రయాణీకులు..కొన్ని వేల కిలోమీటర్ల ఎత్తులో గాలిలో విమానం..అలాంటప్పుడు విమానాన్ని నడిపే పైలట్ ఎంత బాధ్యతాయుతంగా ఉండాలి..కానీ దానిని వదిలేసి నిర్లక్ష్యంగా ప్రవర్తించి గుర్రుపెట్టి నిద్రపోయాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన పాకిస్థాన్‌లో జరిగింది. ఏప్రిల్ 26న ఇస్లామాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన పీకే785 విమానంలో అమిర్ అక్తర్ హస్మీ కాక్‌పిట్‌లో ఇన్‌ఛార్జి బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఆ విమానంలో మహ్మద్ అసద్ అలీ అనే మరో పైలట్ శిక్షణ పొందుతున్నాడు. టేకాఫ్ అయిన తక్షణం హస్మీ విమానం నడిపే బాధ్యతను శిక్షణా పైలట్‌కు అప్పగించి బిజినెస్ క్లాస్‌లో నిద్రపోయాడు..దాదాపు రెండు గంటలపాటు గురకపెట్టాడు..ఆ సమయంలో విమానంలో 305 మంది ప్రయాణికులు ఉన్నారు..ఈ విషయాన్ని గుర్తించిన వారు నిద్రపోతున్న పైలట్ ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు సదరు పైలట్‌ను విధుల నుంచి తొలగించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu