ఉగ్రవాదుల హతంపై.. పహల్గాం బాధిత కుటుంబలు హర్షం
posted on Jul 29, 2025 2:53PM

కశ్మీర్ పహల్గామ్ మారణహోమానికి పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టడంపై బాధిత కుటుంబలు హర్షం వ్యక్తం చేశాయి. ఆ ముగ్గురు ఉగ్రవాదులను ఇండియన్ ఆర్మీ హతం చేయటంతో తమకు కొంత న్యాయం జరిగిందని వారు సంతోషం వ్యక్తం చేశారు. ఉగ్రవాదులను అంతం చేసిన భారత సైన్యానికి ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. గడిచిన మూడు నెలలుగా తాను ఎంత క్షోభను అనుభవిస్తున్నానో మాటల్లో చెప్పలేనని ఉబికి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ గద్గద స్వరంతో చెప్పారు.
నువ్వు పహల్గాంకు ఎందుకు వెళ్లావు..? నువ్వు తప్పకుంట ఇంటికి తిరిగి రావాలి’ అని తాను తరచూ ఆయన ఫొటోతో మాట్లాడుతున్నానని మీడియా ప్రతినిధులతో చెబుతూ ప్రగతి జగ్దాలే ఏడ్చారు. ఆ ఉగ్రవాదుల అంతం న్యూస్ కోసం తాము ఇన్నాళ్లుగా ఎదురుచూస్తున్నామని చెప్పారు. ఇప్పుడు ఆ వార్త విన్నామని అన్నారు. ‘నా దగ్గర తుపాకీ ఎందుకు లేదు..? ఉంటే నేనే ఆ ఉగ్రవాదులను నా చేతులారా కాల్చి చంపేదాన్ని’ అని తాను తరచూ అనుకునేదాన్నని ప్రగతి జగ్దాలే తెలిపారు.ఇటువంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ప్రభుత్వం ఆపరేషన్ మహాదేవ్ కార్యకలాపాలను కొనసాగించాలి." అని వారు తెలిపారు. వారిని కనుగొనడం చాలా కష్టంగా ఉన్నందున ఇది గర్వకారణమైన క్షణం.
భారత సైన్యానికి ధన్యవాదాలు. ఈ రోజు నాకు ఉపశమనం కలిగింది. దీనిపై ఎటువంటి రాజకీయాలు ఉండకూడదు. నా సైన్యం మన దేశాన్ని సురక్షితంగా ఉంచుతున్నందుకు నేను గర్వపడుతున్నాను." అని చెప్పుకొచ్చారు. పహల్గామ్ లో పర్యాటకులపై ఉగ్రవాదులు చేసిన దాడిలో 28 మంది మృతి చెందిన విషయం విదితమే. ఈ దాడికి పాల్పడిన వారిలో ముగ్గురు తీవ్రవాదులను నిన్న మధ్యాహ్నం ఆపరేషన్ మహదేవ్ లో హతం చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇదే విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు పార్లమెంట్‌లో క్లారిటీ ఇచ్చారు.